March 5, 2016

Telangana (PJTSAU) Agriculture University Counselling

, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 19 నుంచి 22 వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. 19, 20 తేదీల్లో ఓపెన్ కేటగిరీకి.. 21, 22 తేదీల్లో రిజర్వుడు కేటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు తెలిపారు. కొత్తగా మంజూరైన పాలెం వ్యవసాయ కళాశాలలో ఈ ఏడాది 60 వ్యవసాయ (ఏజీ) బీఎస్సీ సీట్లు భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన చెప్పారు. జగిత్యాల, అశ్వారావుపేట, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలల్లో మరో 252 సీట్లున్నాయి. మొత్తం 312 ఏజీ బీఎస్సీ సీట్లలో 93 సీట్లు మాత్రమే ఓపెన్ కేగిరీలో ఉన్నాయి. మిగతావన్నీ వివిధ వర్గాలకు కేటాయించారు. వైద్య కోర్సులకు పూర్తికాకుండానే.. సాధారణ వైద్యకోర్సుల్లో సీట్లు రాని బైపీసీ విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో చేరతారు. కానీ తెలంగాణలో ఇంతవరకూ ఎంబీబీఎస్, దంత వైద్య కోర్సుల్లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ జరగలేదు. ఈ నెల 21, 22 తేదీల్లో ఇది జరిగే అవకాశాలున్నాయని సమాచారం. అది పూర్తవకుండానే వ్యవసాయ డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్‌కు ఎలా హాజరుకావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 19, 20 తేదీల్లో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో చేరితే...ఆ తరవాత జరిగే ఎంబీబీఎస్, దంతవైద్య కోర్సుల కౌన్సెలింగ్‌లో సీటు వస్తే విద్యార్థులు అటు వెళతారు. అప్పుడు వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో సీట్లు ఖాళీ అవుతాయి. దీంతో రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించకతప్పదు. ఎంబీబీఎస్ కోర్సులకు కౌన్సెలింగ్ పూర్తయిన తరవాత వ్యవసాయ డిగ్రీ కోర్సులకు నిర్వహిస్తే ఈ సమస్య తలెత్తదు. ఇప్పటికే గృహవిజ్ఞాన శాస్త్రం, ఆహార శాస్త్రం కోర్సుకు కౌన్సెలింగ్‌ను జయశంకర్ వర్శిటీ పూర్తిచేసింది. వీటిలో చేరినవారు కూడా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు రుసుములు కట్టిన తరవాత ఎంబీబీఎస్‌కు వెళితే రుసుము తిరిగిచ్చేది లేదని జయశంకర్ వర్శిటీ స్పష్టం చేసింది. దీంతో ఎంబీబీఎస్, దంతవైద్య కోర్సుల్లో సీటు వస్తే విద్యార్థులు ఈ రుసుమును నష్టపోక తప్పదు.

Telangana (PJTSAU) Agriculture University Counselling

Telangana (PJTSAU) Agriculture University Counselling

Telangana (PJTSAU) Agriculture University Counselling

Telangana (PJTSAU) Agriculture University Counselling

Telangana (PJTSAU) Agriculture University Counselling
  • Govt Jobs
  • TS Govt Sites
  • TS Assara Pensions
  • Aadhaar Card Information
  • Ration Card
  • AP Pahani download
  • TS Pahani download
  • TS RTA Information
  • TS EC Download
  • AP EC Download
  • Ts Deecet Notification TS DEECET Online Apply TS DEECET FEE Payment
    Ts DIETCET Exam Dates TS DIETCET AdmitCard TS DIETCET Admitcard
    Ts Deecet HallTicket TS DEECET Rankcard TS DEECET Results
    Ts Deecet Final Key TS DEECET Web Counselling TS DEECET Final Key
    AP Deecet Notification AP DEECET Online Apply AP DEECET FEE Payment
    AP DIETCET Exam Dates AP DIETCET AdmitCard AP DIETCET Admitcard
    AP Deecet  HallTicket AP DEECET Rankcard AP DEECET Results
    AP Deecet Final Key AP DEECET Web Counselling AP DEECET Final Key
    TET DSC EAMCET PGECET LAWCET ICET PECET

    0 comments:

    Post a Comment

    Recent Posts

     http://www.meesevawarangal.com/p/latest-govt-job-notification-recruitment.html

    » Updates

    Govt Jobs Recruitment

    CET's 2016

    Aadhar Card

    TS Land Records

    Top