ఆలూ పెసర పప్పు కూర వండటం తెలుగులో

ఆలూ పెసర పప్పు కూర వండటం తెలుగులో 


ఆలూ పెసర పప్పు  కూర వండటం


ఆలూ పెసర పప్పు కూర  కు కావలసిన పదార్థాలు:- 


పెసరపప్పు(ఉడికించిన)- ఒక కప్పు
బంగాళాదుంపలు(ఉడికించిన)- రెండు, టొమాటో(తరిగి)- మూడు
పచ్చిమిర్చి(తరిగి)- ఐదు
సన్నగా తరిగిన అల్లం- ఒకటీ స్పూను
కరివేపాకు- రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు- ఒక టేబుల్‌ స్పూను
నీళ్లు- ఒక కప్పు  మాత్రమే
ఆవాలు- ఒక్కో టీస్పూను  మాత్రమే
 జీలకర్ర- ఒక్కో టీస్పూను  మాత్రమే
మెంతులు ఒక్కో టీస్పూను మాత్రమే
పసుపు ఒక్కో టీస్పూను  మాత్రమే
నూనె లేదా నెయ్యి- అర టీస్పూను  మాత్రమే
 ఉప్పు- తగినంత.


ఆలూ పెసర పప్పు కూర  తయారీ విధానం: -
ఒక గిన్నె లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు పొడి  వేసి వేగించాలి. రెండు నిమిషాల తరువాత దానిలో టొమాటో ముక్కలు , పచ్చిమిర్చి , అల్లం చిన్న ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి నూనె పాన్‌ అంచుకు అంటే వరకు బాగా మగ్గనివ్వాలి. అవి వేగాక ఉడికించిన బంగాళాదుంప చిన్న ముక్కలు, పెసరపప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి.
 ఒకవేళ పప్పులో నీళ్లు సరిపోకపోతే అప్పుడప్పుడు కొంచము కొంచము పోస్తుండాలి. అంతే ఆలూ పెసర పప్పు రెడీ... దీన్ని పూరీల్లో తింటే చాలా అద్భుతముగా  ఉంటుంది.

Comments