ఉసిరి పప్పు కూర వండటం తెలుగులో

ఉసిరి పప్పు కూర వండటం తెలుగులో 


ఉసిరి పప్పు కూర కు కావలసిన పదార్ధాలు

ఉసిరికాయలు- 6 (ముక్కలుగా తరగాలి)
కందిపప్పు- కప్పు  మాత్రమే
నూనె- 4 టీ స్పూన్లు
పసుపు- చిటికెడు
ఇంగువ- చిటికెడు  మాత్రమే
ఎండుమిర్చి- 6  మాత్రమే
పచ్చిమిర్చి - 4
కరివేపాకు- 2 రెమ్మలు  మాత్రమే
పోపుగింజలు- 3 టీ స్పూన్లు
ఉల్లిపాయ - 1 మాత్రమే

ఉసిరి పప్పు కూర తయారీ విధానం

ముందుగా పప్పు, ఉసిరికాయ ముక్కలు విడివిడిగా ఉడకబెట్టుకోవాలి .  వాటిని మెత్తగా రుబ్బు  కోవాలి.  గిన్నె లో నూనెపోసి, వేడయ్యాక, ఇంగువ, కరివేపాకు, పోపుగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి   వేయించాలి.  ఉల్లిపాయను నిలువుగా తరిగి దానిని కూడా పోపులో వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత, రుబ్బు కున్న పప్పును కూడా  గిన్నె లో వేయాలి. తర్వాత ఉప్పు, టీ స్పూను పచ్చికారం వేసి బాగా కలపాలి. పదినిమిషాలు ఉడకనిచ్చి, తర్వాత దించాలి. వేడివేడి అన్నంలో ఉసిరికాయపప్పు, నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Comments