- Get link
- Other Apps
కాకరకాయ మసాలా కూర
కాకరకాయ మసాలా కూర కావలసిన పదార్థాలు:
కాకరకాయ మసాలా కూర కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - పావుకిలో మాత్రమే , ఉల్లిపాయ - ఒకటి మాత్రమే , ఒకటి టొమాటో - , అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, పావు కప్పు - వేరుసెనగలు , కారం - అర టీస్పూన్, చింతపండు - కొద్దిగా, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు మాత్రమే , ఆవాలు - అర టీస్పూన్ , జీలకర్ర - అర టీస్పూన్ మాత్రమే , ఎండుమిర్చి - రెండు మాత్రమే , కరివేపాకు - కొద్దిగా.
కాకరకాయ మసాలా కూర తయారీ విధానం:
కాకరకాయలను బాగా ఉడికించాలి. వేరుసెనగలు వేగించి పొట్టు తీసి కోవాలి . పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి బాగా వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మరియు టొమాటో ముక్కలు వేసి మరికాసేపు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నె లో మరికాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి . ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు వేసి కలియబెట్టాలి. వేరుసెనగలు, ఉల్లిపాయలు, టొమాటో పేస్టు, బెల్లంలో అర కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి . ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కాకరకాయల్లో వేసి కలపాలి. తగినంత ఉప్పు మరియు కారం వేసి మంటపై పావు గంట పాటు ఉడికిస్తే కాకరకాయ మసాలా కూర తయారవుతుంది .
Comments
Post a Comment