మొరాకో చికెన్ మసాలా వండటం తెలుగులో
కావలసిన పదార్థాలు:చికెన్: అరకేజీ
ఉల్లిపాయలు: 2
టమాటాలు: 2
పెరుగు: అరకప్పు
పసుపు: పావు టీ స్పూను
నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి: 6
వెల్లుల్లి రేకలు: 5
అల్లం ముక్క: అరంగుళం
మిరియాలు: 8
మెంతులు, జీలకర్ర, గసగసాలు: 1 టీ స్పూను చొప్పున
కొత్తిమీర: గుప్పెడు
లవంగాలు, యాలకులు: 2 చొప్పున
దాల్చినచెక్క: చిన్న ముక్క
నూనె: 2 టేబుల్ స్పూన్లు
తయారీ:
శుభ్రం చేసిన చికెన్ ముక్కలను నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి. ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి,టమాటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్న మంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లితే సరి.
Post a Comment