చికెన్ లాలీపాప్స్ వండటం తెలుగులో

చికెన్ లాలీపాప్స్ వండటం తెలుగులో 

కావలసిన పదార్థాలు:

బోన్లెస్ చికెన్: పావుకిలో
అల్లం వెల్లుల్లి ముద్ద:
మసాలా: చెంచా
కొత్తిమీర: కొద్దిగా
పచ్చిమిర్చి ముద్ద: చెంచాన్నర
మొక్కజొన్నపిండి: రెండు చెంచాలు
ఉప్పు, కారం: తగినంత
ఐస్క్రీమ్ పుల్లలు: కొన్ని

తయారీ:

చికెన్ను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. ముక్కల్ని మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. ముద్దను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, మసాలా, కారం, మొక్కజొన్నపిండి బాగా గరిటెతో బాగా కలియతిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఐస్క్రీమ్ పుల్లలకు గుచ్చి పక్కనపెట్టాలి. వేడయ్యాక ఐస్క్రీమ్ పుల్లలు మునగకుండా మిశ్రమాన్ని ముంచాలి. చికెన్ మిశ్రమం వేగాక బయటకు తీస్తే లాలీపాప్స్ సిద్ధమయినట్లే.

0/Post a Comment/Comments