కోకోనట్ చికెన్ ఫ్రై వండటం తెలుగులో
కావలసిన పదార్థాలు:చికెన్: 1/4 కేజీ
ఉల్లిగడ్డలు: 2
అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాల: 1/2 టీ స్పూన్
మిరియాల పొడి: 1/4 టీ స్పూన్
అనాసపువ్వు: 1
ఎండుకొబ్బరి: 1 చిన్న కప్
కరివేపాకు: 1 కొమ్మ
కొత్తిమీర, పుదినా: నచ్చినంత
కారం: టీ స్పూన్
ఉప్పు, పసుపు: తగినంత
తయారీ:
బోన్లెస్ చికెన్ తీసుకుని ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. మరో పాన్ స్టౌపై పెట్టి నూనె వేసి షాజీరా, అనాసపువ్వు, 1 లవంగం, కరివేపాకు వేయాలి. తరవాత ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 3నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో ముందుగా ఉడకపెట్టిన చికెన్ వేసి సరిపడినంత ఉప్పు, కారం వేసి 3నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసి దింపేయాలి.
Post a Comment