మామిడికాయ పప్పు కూర వండటం తెలుగులో

మామిడికాయ  పప్పు కూర వండటం తెలుగులో 

మామిడికాయ  పప్పు కూర కావలసిన పదార్థాల వివరాలు :-



కందిపప్పు - 300గ్రాములు మాత్రమే 
మామిడికాయ - ఒకటి మాత్రమే
నూనె - మూడు టేబుల్‌స్పూన్లు
కారం - టీస్పూన్‌ మాత్రమే
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 టీస్పూన్లు మాత్రమే
 పసుపు - అర టీస్పూన్‌
నిమ్మరసం - కొద్దిగా, నెయ్యి - టీస్పూన్‌
కరివేపాకు - కొద్దిగా
ఆవాలు - టీస్పూన్‌ మాత్రమే
జీలకర్ర - టీస్పూన్‌ మాత్రమే
ఎండుమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత.




మామిడికాయ  పప్పు కూర తయారుచేసే విధానం  





ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలి తరువాత  మామిడికాయ పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
ఒకపాత్రలో నూనె వేసి, వేడి అయ్యాక ఉడికించిన కందిపప్పును అందులో వేయాలి. కారం, అల్లం వెలుల్లి పేస్ట్‌, పసుపు, నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.  
 మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి, కలపాలి. మరొక పాత్రలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి కలిపి, మరికాసేపు ఉడికించుకుని సర్వ్‌ చేసుకోవాలి.


0/Post a Comment/Comments