మునక్కాడ పప్పు కూర వండటం తెలుగులో

మునక్కాడ పప్పు కూర వండటం తెలుగులో 


మునక్కాడ పప్పు కూర  కు కావలసినవి:
మునక్కాడలు @  (తొక్కు తీసి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
కందిపప్పు @  150గ్రా
టమేటాలు @  3
ఉల్లి ముక్కలు @ 1 కప్పు
వెల్లుల్లి ముక్కలు @  1 టీస్పూను
పచ్చిమిర్చి@  5
ఎండుమిర్చి @ 3
చింతపండు @  1 స్పూను (నీళ్లలో నానబెట్టుకోవాలి)
పోపు దినుసులు @  1 టీస్పూను
ఉప్పు, కారం, నూనె @  తగినంత
పసుపు @ పావు టీస్పూను
కొత్తిమీర, కరివేపాకు @  కొద్దిగా

మునక్కాడ పప్పు కూర వండటం తయారీ విధానం:

ప్రెషర్‌ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు వేసి , ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్‌ వచ్చేంతవరకూ బాగా ఉడికించాలి తరువాత
నీళ్లు వార్చుకుని గిన్నెలో వేసుకోవాలి.
ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, టమేటాలు, నీళ్లు పోసి 3 విజిల్స్‌ వచ్చేంత వరకూ బాగా  ఉడికించి చల్లార్చాలి.కొద్దీ సేపు తరువాత
  పప్పు రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి.
దీన్లోనే ఉడికించిన ములక్కాడ ముక్కలను  , చింతపండు పులుసు ను , ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలపాటు బాగా ఉడికించాలి తరువాత
మునక్కాడ పప్పు కూర  తింటే చాలా రుచిగా ఉంటుంది.

0/Post a Comment/Comments