చికెన్ క్యారెట్ కూర వండటం తెలుగులో

చికెన్ క్యారెట్ కూర వండటం తెలుగులో 

కావలసిన పదార్థాలు:

చికెన్ ముక్కలు: పెద్ద కప్పు
ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరగాలి)
క్యారెట్లు: ఆరు(ముక్కల్లా తరగాలి)
అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా
పసుపు: కొద్దిగా
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: చెంచా
నీళ్లు: రెండు కప్పులు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా
గరంమసాలా: చెంచా

తయారీ:

బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అందులోనే అల్ల్ంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరియాలపొడి, చికెన్ ముక్కలు వేసి, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక క్యారెట్ ముక్కలు, తగినంత ఉప్పు, గరంమసాలా వేసి మళ్లీ మూతపెట్టాలి. ఇరవై అయిదు నిమిషాలకు అన్నీ ఉడుకుతాయి. పైన కొత్తిమీర తరుగు చల్లి బ్రెడ్ తో కలిపి వడ్డించాలి.

0/Post a Comment/Comments