మునగాకు పప్పు కూర వండటం తెలుగులో

మునగాకు పప్పు కూర వండటం తెలుగులో 


మునగాకు పప్పు  కూర వండటం

మునగాకు పప్పు కూర కు కావలసిన పదార్థాలు: 

పెసరపప్పు - ఒక కప్పు, మునగ ఆకు సన్నగా తరిగినది - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - 3 లేక 4, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నిమ్మచెక్క - ఒకటి, నూనె - తగినంత, పోపు గింజలు - టీ స్పూను.

మునగాకు పప్పు కూర తయారుచేయు విధానం:

 ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును బాగా ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో అందులో వరసగా మునగ ఆకులు , పసుపు పొడి , పచ్చిమిరపకాయ ముక్కలు , ఉప్పు వేసి పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండాలి. ఆ తర్వాత స్టవ్‌పై గిన్నె  ఉంచి అందులో కాస్త, పోపు గింజలు వేసి వేగించి పప్పులో కలపాలి. కొత్తిమీర  కూర మీద చల్లుకోవాలి  అప్పుడు  తింటే చాలా అద్భుతముగా  ఉంటుంది.

0/Post a Comment/Comments