దోసకాయ చికెన్ కూర వండటం తెలుగులో
కావలసిన పదార్థాలు:చికెన్: అరకేజీ
దోసకాయ: ఒకటి (పెద్దది)
ఉల్లిపాయ: ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, గరం మసాల: ఒక్కోటి టేబుల్ స్పూను చొప్పున
ధనియాల పొడి, ఎండుకొబ్బరిపొడి: ఒక్కోటి టేబుల్ స్పూను చొప్పున
ఉప్పు: తగినంత
నూనె: పావుకప్పు
తయారీ:
దోసకాయల్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసి కాస్త పెద్ద ముక్కలుగా కోయాలి. అలానే చికెన్, ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకోవాలి. తరవాత బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం చేర్చాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి మూతపెట్టాలి. దోసకాయ సగం ఉడికి మెత్తబడ్డాక చికెన్ ముక్కల్ని చేర్చి గరిటెతో బాగా కలియతిప్పాలి. అవసరాన్ని బట్టి మరికాసిని నీళ్లు చేర్చి మూతపెట్టేయాలి. చికెన్ ముక్కలూ బాగా ఉడికాక ధనియాల పొడి, కొబ్బరిపొడి కలపాలి. కొద్దిసేపటికి కూర దగ్గరిగా వచ్చాక దింపేస్తే సరిపోతుంది. దోసకాయ చికెన్ను టమాటా ముక్కలు, కొత్తిమీరతో అలంకరించాలి. దీన్ని అన్నంలో తింటే భలే రుచి. రొట్టెలు, పూరీల్లో అద్దుకున్నా బాగు.
Post a Comment