చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వండటం తెలుగులో

చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్  వండటం తెలుగులో 

కావలసిన పదార్థాలు:

బోన్లెస్ చికెన్: పావు కిలో
సోయాసాస్: రెండు చెంచాలు
మిరియాల పొడి, ధనియాల పొడి: ఒక్కోటి అరచెంచా చొప్పున
ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు
ఉప్పు, కారం: తగినంత
వెల్లుల్లి రేకలు: ఆరు
అల్లం ముక్కలు: రెండు చెంచాలు
కరివేపాకు: రెండు రెమ్మలు
గుడ్లు: రెండు
అన్నం: రెండు కప్పులు
నూనె: పావు కప్పు
నిమ్మరసం: రెండు చెంచాలు

తయారీ:

చికెన్ను సన్న ముక్కలుగా తరిగి శుభ్రంగా కడగాలి. నిమ్మరసం, ఉప్పు, కారం, కలిపి చికెన్ కు పట్టించి అరగంట నానబెట్టాలి. బాణలిలో నూనె వేడిచేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి మగ్గించాలి. తరవాత దాన్లో చికెన్ వేసి సన్న మంట పెట్టాలి. చికెన్ బాగా వేగాక బాణలిని దించేయాలి. ఇప్పుడు మరో బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేసి అందులో గుడ్ల సొనతో ఆమ్లెట్ వేయాలి. దీనిని వేగాక చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరవాత అందులో అన్నం, వేగిన చికెన్ను వేసి బాగా కలిపి, కారం, ధనియాల పొడి, ఉప్పు, సోయాసాస్, కరివేపాకు, మిరియాల పొడి జోడించి దించేస్తే సరి.

0/Post a Comment/Comments