వంకాయ పెసరపప్పు కూర వండటం తెలుగులో
వంకాయ పెసరపప్పు కూర వండటం
వంకాయ పెసరపప్పు కూర కు కావలసిన పదార్థాలు:
వంకాయలు @ అరకిలో
పెసరపప్పు @ పావుకిలో
కారం @ 1 టీ స్పూను
ఉప్పు @ రుచికి సరిపడా
నూనె @ 1 టేబుల్ స్పూను
ఆవాలు, జీలకర్ర, మెంతులు,మినప్పప్పు (కలిపి ) @ 1 టీ స్పూను
కరివేపాకు @ 4 రెబ్బలు
ఎండుమిర్చి @ 4
వెల్లుల్లి రేకలు @ 5
పసుపు పొడి @ చిటికెడు.
వంకాయ పెసరపప్పు కూర తయారుచేసే విధానం:
పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు పొడి , తగినంత నీరు చేర్చి గిన్నె ను స్టౌవ్ మీద పెట్టాలి. పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి తరువాత పప్పు, ముక్కలు మెత్తబడ్డాక దించేసి ఉప్పువేసి కలపాలి. తర్వాత గిన్నె లో ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టి పప్పుని అందులో వేసి తిప్పాలి.
తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో - ఇదే పద్ధతిలో కందిపప్పులో పండు (పసుపు వన్నె) వంకాయల్ని వేసి పప్పు చేస్తుంటారు. ఇది కూడా చాలా అద్భుత రుచిగా ఉంటుంది)
Post a Comment