మామిడికాయ చికెన్ వండటం తెలుగులో

మామిడికాయ చికెన్ వండటం తెలుగులో 

కావలసిన పదార్థాలు:

మామిడికాయ(చిన్నది): ఒకటి
చికెన్: కిలో
ఉల్లిపాయలు: మూడు
కరివేపాకు రెబ్బలు: రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూను
గరం మసాలా: అర టీ స్పూను
కారం: రెండు టీ స్పూన్లు
పసుపు: కొద్దిగా
ఉప్పు: తగినంత
కొత్తిమీర: ఒక కట్ట
నూనె: తగినంత

తయారీ:

చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఉప్పు, కారం, గరంమసాలా వేసి బాగా కలపాలి. తరవాత చికెన్ వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి బాగా ఉడికించాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి.

0/Post a Comment/Comments