బుట్టమిర్చి ఘాటుకోడి వండటం తెలుగులో కావలసిన పదార్థాలు:
బోన్లెస్ చికెన్: పావు కిలో
క్యాప్సికమ్ (బుట్టమిరప): ఒకటి
పెద్ద ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లి రేకలు: ఎనిమిది
అల్లం ముక్కలు: చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
నిమ్మరసం: ఒక చెంచా
కారం: అరచెంచా
ధనియాల పొడి: అరచెంచా
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
తయారీ:
చికెన్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు. వీటిని చిన్నముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. కడాయిని బాగా వేడిచేసుకుని ముందుగా అల్లం,ఉల్లిపాయ ముక్కలని, వెల్లుల్లి రేకలని దోరగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసి దానికి కొద్దిగా నీళ్లు కలిపి మూతపెట్టేయాలి. అది సగం వరకు ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా కలిపి ఉడికించుకోవాలి. చికెన్, క్యాప్సికమ్ ఉడికిన తర్వాత పొయ్యి కట్టేసి, కాస్త చల్లారే సమయానికి నిమ్మరసం చల్లి మూత పెట్టేయాలి. అంతే క్యాప్సికమ్ చికెన్ సిద్ధం అవుతుంది. ఇది పుల్కాలు, రోటీలు, ఫ్రైడ్ రైసుల్లో తింటే భలే రుచిగా ఉంటుంది.
Post a Comment