*💊ఎసిడిటీ మాత్రలు వాడే వారికి హెచ్చరిక ?

*💊ఎసిడిటీ మాత్రలు వాడే వారికి హెచ్చరిక ?🔴*

ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ ఆహారం తీసుకోవాలన్న భయమేస్తుందని చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది.

 ఒకప్పుటి కాలంలో ఉన్న మనుషులకు ఇప్పటికాలంలో బ్రతుకుతున్న వారికి ఎంతగానో తేడా ఉంది.

 ఆ కాలంలో ఏం తిన్నా జీర్ణం చేసుకునే వారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట లాంటివి వస్తున్నాయి.
ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు. 


ఇకపోతే ఎసిడిటీ అనేది జబ్బు కాదు. మన జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో ఆమ్లాలు ఉత్పన్నమైనప్పుడు కలిగే మంట. 

రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.

 ఇకపోతే నేటి కాలంలో అజీర్తి లాంటి సమస్యలు ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయాయి

మారిన జీవన శైలి, షిఫ్ట్ ఉద్యోగాలు, నిద్ర సమస్యలు, టెన్షన్లతో కడుపుపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో కడుపులో మంటగా అనిపిస్తే చాలు, చాలా మంది ఎసిడిటీ మాత్రలు తెచ్చుకుని వేసేసుకుంటున్నారు.
ఇలాంటి వాళ్లందరిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 *తాత్కాలికంగా రిలీఫ్ కోసం వాడే ఈ టాబ్లెట్స్ వల్ల శరీరంలో కీలక అవయవాల్లో ఒకటైన కిడ్నీ పాడవ్వుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.*

 *దీర్ఘకాలంగా ఎసిడిటీ మాత్రలు వాడితే 'అక్యూట్ కిడ్నీ ఇన్‌జ్యురీ' అంటే లోలోపల కిడ్నీ దెబ్బతిని.. ఒక్కసారిగా పని చేయకుండా మానేసే స్థితిలోకి వెళ్లిపోతుందని* వారి ప్రయోగాల్లో వెల్లడైందట.
మనం వాడే మందుల్లో కొన్ని పేర్లను కూడా వారు వెల్లడించారు.

అవేంటంటే *పాంటాప్రజోల్, ఒమెప్రజోల్, లాన్సోప్రజోల్, ఎసొమెప్రజోల్ సహా వాటి కాంబినేషన్లతో వచ్చే అన్ని మాత్రల విషయంలో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించారు*. 


ప్రస్తుతం ఏ సమస్యతో ఆస్పత్రికి పోయినా దానికి ఇచ్చే టాబ్లెట్లతో పాటు గ్యాస్ మాత్రలు కూడా ఇస్తున్నారు. 

వీటి వినియోగంపై కంట్రోల్ అవసరమని ఔషధ నియంత్రణ బోర్డు సూచించింది.. 


కాబట్టి ఈ మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు....🔴

0/Post a Comment/Comments