Employees Health Scheme Andhra Pradesh Steat Government

ఆంద్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ Employees , ఉద్యోగస్తులు మరియు పించన్ దారులు  Health Scheme వివరాలు 

ఉద్యోగ దారులు  వారి  ఉద్యోగ ఐడి నెంబరు  యూజర్ ఐడి 

 పాస్ వర్డ్  ఉద్యోగ ఐడి నెంబరు తో లాగిన్ అవ్వాలి

  Government Employees Health Scheme

ప్రస్తుతము అమలులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 లోని ‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు (క్యాష్ లెస్ ట్రీట్ మెంట్) ఎమ్పానేల్ కాబడిన నెట్వర్క్ ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది. జాబితాలో పొందుపరిచిన థెరపీలకు ఈ పథకం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స అందించ బడుతుంది.

అర్హత:

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకం గా ఈ పధకం పిలవబడుతుంది.ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనరులకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా 'నగదు రహిత' చికిత్స అందించడం ఈ పధకం లక్ష్యం.
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,రాష్ట్ర పెన్షనరులకు ,వారిపై ఆధారపడిన కుటుంభసభ్యులకు నగదు రహిత చికిత్స అందిస్తుంది. ఈ పధకం క్రింద లబ్దిదారులందరికీ ఎ.పి.ఐ.యమ్.ఎ. నిభందనల క్రింద పొందిన లబ్ది ఇకపై ఆగిపోతుంది.క్రింద పేర్కొన్నవిభాగాల వారు ఈ పధకం లబ్ది దారులు.

  1. పస్దుతం పనిచేస్తున
    1. క్రమబద్దీకరించిన అందరు ప్రభుత్వ ఉద్యోగులు.
    2. స్థానిక సంస్థలోని ప్రోవిషన్ వైజ్ ఉద్యోగులు.
  2. విశ్రాంతి ఉద్యోగులు
    1. అందరు సర్వీసు పెన్షనరులు
    2. అందరు కుటుంబపెన్షను దార్లు(వీరిపై ఆధారపడినవారికీ వర్తించదు)
    3. తిరిగి ఉద్యోగంపొందిన సర్వీసు పెన్షనరులు

హెల్త్ కార్డ్   కొరకు http://www.ehf.gov.in/
కుటుంబం:
దిగువపేర్కొన్న వారు కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు.
  1. తల్లిదండ్రులు : (ఉద్యోగిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా కన్న తల్లిదండ్రులు,ఏదో ఒక తల్లిదండ్రులు మాత్రమే)
  2. చట్టప్రకారం వివాహం చేసుకున్న భార్య మరియు ఆమెఫై ఆధారపడిన ఆమె తల్లిదండ్రులు (పురుష ఉద్యోగుల /సర్వీపు పెన్షనరుల విషయంలో).
  3. భర్త ,అతనిఫై ఆధారపడిన అతని తల్లిదండ్రులు (మహిళా ఉద్యోగుల /సర్వీపు పెన్షనరుల విషయంలో).
  4. పూర్తిగా ఆధారపడిన చట్టబద్దమైన సంతానం (సవతి పిల్లలు,దత్తత పిల్లలతో సహా).

ఆధారపడడం అంటే:
ఆధారపడడం అనే పదానికి దిగువ అర్ధం వర్తిస్తుంది

  1. తల్లిదండ్రుల విషయంలో, వారి పోషణ కోసం ఉద్యోగిపై ఆధారపడినవారు.
  2. నిరుద్యోగ కుమార్తెల విషయంలో , అవివాహితులు ,వైధవ్యం పొందినవారు ,విడాకులు పొందినవారు, భర్తచే వదిలివేయబడినవారు.
  3. నిరుద్యోగ కుమారుల విషయంలో 25 ఏళ్ళలోపు వయస్సు కలిగిన వారు,ఉపాధి లేదా ఉద్యోగం పొందడానికి వీలులేని వైకల్యం కలిగినవారు.

ఎన్రోల్మెంట్:

బీమా సౌకర్యం పొందిన ఎన్రోల్మెంట్ కు ఒక యూనిట్ గా పరిగణించబడతారు .భార్య, భర్తలు ఇద్దరూ ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనర్లు అయిన సందర్భంలో ఆధారపడిన కుటుంబ సబ్యుల విషయమై ఏవిషమైన డూప్లికేషన్ ఇద్దరిపైనా వేర్వేరుగా ఆధరపడినట్టు చూపరాదు.
ఎన్రోల్మెంట్ విధానం:
అథెన్ట్ కేషన్ :
అర్హులిన లబ్దిదారులందరికీ అర్హతకార్డులుగా పిలవబడే ఆరోగ్యకార్డులు అందచేయబదతాయి. ఆరోగ్యకార్డుల వివరాల ఆధారంగా లబ్దిదార్లు అర్హతను ఆన్ లైను విధానంలో పరిశీలించడం జరుగుతుంది. లబ్దిదారులు అర్హత కార్డును సిబ్బందికి చూపించాలి. అర్హత కార్డులేనప్పుడు కార్డునెంబరుని తెలపాలి.నెట్వర్క్ ఆసుపత్రులలో ఏర్పాటైన 'కియాస్క్' వద్ద ఉన్న సిబ్బంది అర్హతకార్డు వివరాలను పొందుపరచిన డేటా బేసు నుండి 'ఆన్ లైను' ద్వారా సరిచూస్తారు. అథెన్ట్ కేషన్ ,జెన్యునిటి, అర్హత పరిశీలించండి.పూర్తికావడంతో అథెన్ట్ కేషన్ పూర్తవుతుంది.

ప్రయోజనాలు:

ముందునుంచి వున్న వ్యాదులు:
అన్నివ్యాదులకు తొలిరోజునుంచి చికిత్స అందించడం జరుగుతుంది.కాంట్రాక్టు ప్రారంభానికి ముందునుంచి ఉద్యోగి లేదా పెన్షనరును భాధిస్తున్న ఏ వ్యాధి అయినా ఈ పధకంలో ఉచిత చికిత్స జరుగుతుంది.
ఔట్ పేషంటుగా చికిత్స:
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో ప్రస్తుతం దీర్ఘకాలిక(క్రానిక్) వ్యాధులకు మాత్రమే ఔట్ పేషంటు సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇతర వ్యాధులకు ఔట్ పేషంటు సేవలకోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించండి.
ఇన్ పేషెంట్ గా చికిత్స:
వివిధ విభాగాల్లో గుర్తించిన వ్యాధులకు జాబితాలోపేర్కొన్న చికిత్స విధానాల (x`స్)అందచేయబడతాయి. రోగులకు (ఫాలోఅప్) ప్యాకేజిల క్రింద ఆసుపత్రి అనతర కొనసాగింపు (ఫాలోఅప్) సేవలు అందచేయబడతాయి.
చికిత్స విధానాల (దేరఫి) జాబితా
కొనసాగింపు చికిత్సల జాబితా
ప్యాకేజి:
దిగువ సేవలన్ని ప్యాకేజి లో యిమిడి ఉన్నాయి:
  1. జాబితాలోచేర్చిన చికిత్స (దేరఫి ),పొందిన రోగులకు మొదటినుంచి చివరకు నగదు రహిత సేవలు నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా అందించడం 'డిస్చార్జి ' అయిన 10 రోజుల వరకు ఉచితంగా మందులు అందచేయడం ,నెల రోజుల వరకు ఎటువంటి సమస్యలు తలెత్తినా వైద్యసేవలంధించడం
  2. చికిత్స పొందడం యష్టంలేని రోగులకు (జాబితాలో వున్న చికిత్సలకు సంబంధించి ) ఉచితంగా వ్యాధి ధృవీకరణ నిర్వహణ
  3. 19.3 . లో పేర్కొన్న యితర సేవలు అందించడం.
ప్యాకేజిల వివరణ :
జాబితా లోని చికిత్సల కోసం ప్రతి ఒక్కరికి నగదు రహిత సేవలు అందించడం . చికిత్స కోసం ఆసుపత్రి కి వెళ్లిన నాటి నుంచి ఎటువంటి నగదు చెల్లింపులు లేకుండా ఉచిత వైద్య సేవలు పొంది తిరిగి రావడం ,వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఏమి చెల్లించనవసరం లేదు. ఈ ప్యాకేజిక్రింద సేవలు పొందడానికి ట్రస్ట్ ఎప్పటికప్పుడు రూపొందించే మార్గదర్శక సూత్రాలు అనుసరించాలి /p>
గమనిక :
ఆసుపత్రుల స్థాయి నిర్ధారణ (గ్రేడింగ్) , ప్యాకేజిరేట్లు ,పూర్తిస్థాయి అంచనాలుపై అవగాహనకు బెంచి మార్కు గుర్తించడం జరుగుతుంది .
రోగిని సమీపంలోని ఆసుపత్రికి రిఫర్ చేసేందుకు వీలుగా భౌగోళికంగా ప్రాంతాలకు దగ్గరలో ఉండే ఆసుపత్రుల జాబితా ప్రకటించడం జరుగుతుంది .
దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం (డయాబెటిస్ ) వంటి వ్యాధులతో భాధపడే రోగులు ఏ ఆసుపత్రిలో మందులు పొందాలో అన్నవిషయం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేర్కొంటుంది .
కొన్ని చికిత్సలను ' నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్' వంటి కొన్ని సంస్థలకు పరిమితం చేసే అధికారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఉంటుంది .
ప్యాకేజి లో ని సేవల విశదికరణ :
కింద పేర్కొన్న సేవలు ప్యాకేజిలోయిమిడి వున్నాయి:
  1. తత్కాలిక నివాసం (స్టే) :- ఇన్ పేషెంట్ గా వుండేందుకు ఐ.సి .యు , ఆపరేషన్ అనంతర వార్డు ,పాక్షిన ప్రయివేటు వార్డు మరియు ప్రయివేటు వార్డుల లోని బెడ్ చార్జీలు తాత్కాలిక నివాసం .
  2. ఇన్ పుట్స్: ఓ.టి .చార్జీలు ,ఓ .టి .ఫార్మసీ, ఓ .టి డిస్పోజబుల్స్ ,కన్యూమల్స్ ,ఇంప్టాంట్స్,రక్తం ,రక్తానికి సంబంధించిన ఉత్పత్తులు ,సాధారణ మందులు ,ఆక్సిజన్ ,నిపుణులైన వైద్యుల ఫీజు ఆసుపత్రిలోని వైద్యుల ఫీజు ఆసుపత్రిలోని వైద్యుల ఫీజులు ఇన్ పుట్స్లో ఇమిడి వున్నాయి.
  3. నిర్ధారణ పరీక్షలు : అన్ని బయోకెమిస్త్రీ ,పాధాలజి ,మైక్రోబయోలజి ,ఇమేజియాలజి ,నిర్ధారణ పరీక్షలు ,వ్యాధి నిర్ధారణ ,రోగి నిర్వహణ ఖర్చులు ఈ ప్యాకేజిలో వున్నాయి .
  4. ఇతర ఖర్చులు : ఆహారం మరియు రవాణా చార్జిలు ,నిర్ధారించిన నాణ్యత కలిగిన ఆహారం ,ఆసుపత్రి లోపల ఉన్న క్యాన్ టీన్ నుండి గాని , బైట అమ్మకం దార్లనుండి గాని ఉచితంగా అందించాలి . నెట్వర్క్ ఆసుపత్రి నుండి రోగి స్వంత మండల ప్రధాన కార్య స్థానానికి మధ్య ఆర్.టి.సి బస్సు రేటుకు సమానమైన సొమ్ము లేదా రూ .50 /- (ఏది తక్కువ అయితే అది ) తిరుగు ప్రయాణ చార్జీలుగా చెల్లించడం జరుగుతుంది .
రక్తం మరియు సంబంధిత ఉత్పత్తులు :
అందుబాటుకు అనుగుణంగా ,ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నుండి కానీ ,బైట ఒప్పందం కుదుర్చుకున్న బ్లడ్ బ్యాంకు నుంచి కానీ అవసరమైన పక్షంలో రోగి కి రక్తం అందించాలి .ప్యాకేజి లో ఉన్న ప్రకారం ఆసుపత్రి స్వంత బ్లడ్ బ్యాంకు నుంచి బ్లడ్ అందించాలి .ఒకవేళ స్వంత బ్లడ్ బ్యాంకు లో రక్తం అందుబాటులో లేకపోతే ,రెడ్ క్రాస్ సంస్థ యితర స్వచ్చంద సంస్థలు నిర్వహించే బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం సేకరించే కృషి చేయాలి .ఇతర సంస్థలనుంచి రక్తం సేకరించేదుంకువీ లుగా ఒక లేఖను రోగికి ఇవ్వాలి.
ప్రత్యేక జాబితాలో వున్న చికిత్సల ప్యాకేజి:
    1. కాన్సర్ చికిత్స క్రింద ప్యాకేజి : కీమోధెరఫీ , రేడియోధెరఫీ చికిత్సలో ఏర్పడే సైడ్ ఎఫెక్టులను నిరోధించే పరిజ్ఞానం వున్న శిక్షణ పొందిన నిపుణులతో మాత్రమే చేయించాలి.(మెడికల్ ఆంకాలజిస్ట్ లు , రేడియో ఆంకాలజి స్ట్ లు)
    2. హెమెటలాజికల్ మాటిగ్ నెస్సిస్ (ల్యుకేమియా,లింఫోమాస్ ,మల్టిపుల్ మైలోమా ) తో ఉన్న రోగులు వీడియోట్రిక్ మాలిగ్ నేన్రిస్ (14 ఏళ్ళలోపు వయస్సు వున్న రోగులు ) వున్న రోగులు మెడికల్ ఆంకాలజిస్ట్ ల తో మాత్రమే చికిత్స చేయించాలి .
    3. కన్వెషనల్ రేడియోధెరఫీ కు స్పందించని కేసులు ,వ్యాదులలో మాత్రమే అడ్వాన్సుడు రేడియోధెరఫీ ప్రోజిసర్సు ఉపయోగించాలి .
    4. చికిత్సల జాబితాలో ట్యూమర్ (కంతి) ని చేర్చలేదు .రోగాన్ని తగ్గించడంలో ధీర్ఘకాల పురోగతి ,వ్యాధి నివారణ రుజవ వు తాంటే ట్యూమర్స్ (కంతులు) కీమోధెరఫీ విధానంలో చికిత్స చేయవచ్చు .పూర్తి స్థాయి సర్వయివ లేని కేసునుంచి కేసుకు సమీక్షించాలి.
  1. పాలిట్రుమా విభాగంలో ప్యాకేజి: 
  2. పాలిట్రుమా విభాగంలో ఆర్థోపెడిక్ ట్రామా (శాస్త్రచికిత్సలతో సరిచేసేవి), న్యూరలాజికల్ (నరాలకు సంబంధించిన) ట్రామా, (శాస్త్రచికిత్సలు, మందుల వాడకంతో సరిచేసేవి), రొమ్ము సంమ్భందించిన గాయాలు ( శాస్త్రచికిత్సలు, మందుల వాడకంతో సరిచేసేవి ), పొత్తికడుపుకు సంబందించిన గాయాలు) భాగాలుగా వున్నాయి. రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్సలో వీటిని కలిపి లేదా విడివిడిగా వినియోగించవచ్చు.
  3. ఒకవారం ఆసుపత్రిలో వుంచి చేయగలిగిన (ఇమేజియాలజి ఆధారంగా) తీవ్ర గాయాలు ఉన్న కేసులు మాత్రమే ఈ ప్యాకేజీలో చికిత్స చేయాలి.సాదారణ, స్వల్ప గాయాలు వున్న కేసులు ఈ ప్యాకేజీలో అమలు చేయకోడదు.
  4. న్యురలాజికల్ (నరాలకు సంబందించిన ) ట్రోమా విషయంలో హెచ్.ఎం.ఆర్.ఐ స్కానింగ్ వంటి ఇమేజియాలజి, గ్లాస్గో కోమా స్కేల్ ఆధారంగాను (13 కంటే తక్కువ వున్న స్కేల్ వాంచ్చనియం ) ఆసుపత్రిలో చేర్చాలి.
  5. పాలిట్రుమాకు సంబందించిన అన్ని శాస్త్రచికిత్సలు ఆసుపత్రిలో చేర్చిన కాలంలో పనిలేకుండా ఈ ప్యాకేజీలో అమలు చేయాలి.
  6. ట్రామా పేషెన్ట్ లు అందరికి సాధారణ పరిక్షలు ఉచితం.
వైద్య సేవల కొనసాగింపు ప్యాకేజిలు
  1. అన్ని చికిత్సల విభాగాలలో ఆరోగ్య సేవల కొనసాగింపు ఈ పధకంలో కల్పించబడుతుంది. డాక్టర్ను సంప్రదించడం, మందులు, వ్యాది నిర్ధారణ పరీక్షలు వంటి సేవలు నగదు రహితంగా లబ్దిదారులకు అందచేయబడతాయి. అంతేకాకుండా లబ్దిదారులకు పూర్తిస్థాయి ప్రయోజనం చేకూర్చడం, వ్యాధి పరంగా ఎటువంటి చిక్కులు రాకుండా నివారించడం జరుగుతుంది. ఈ ప్యాకేజిలో నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు కొనసాగింపు చేపడతారు. దీనికయ్యే ఖర్చు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నెట్ వర్క్ ఆసుపత్రులకు అందుతుంది.
  2. ఈ ప్యాకేజిల మార్గదర్శక సూత్రాలు దిగువ పేర్కొనబడినాయి
    1. వైద్య సేవల కొనసాగింపు రోగిని ఆసుపత్రి నుంచి డిస్ఛార్జ్ చేసిన 11 వ రోజు నుంచి ఒక సంవత్సరకాలం పాటు నగదు రహితంగా కొనసాగిమ్పబడుతుంది. ఈ వైద్య సేవల కొనసాగింపు ప్రతి ఏట పధకంతో పాటు పొడిగింపబడుతుంది.
    2. దీనికి ప్రీఆదరైజేషన్ అవసరం లేదు.
    3. నిర్వాహణ సౌలభ్యం కోసం ప్యాకేజి సొమ్మును 4 విడతలలో వినియోగించడం జరుగుతుంది. మొదటిసారి ఆసుపత్రి సందర్శన, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మొదటి త్రైమాసకంలోనే అధికంగా వుంటాయి.అందువల్ల మొదటి ఇన్స్టాల్మెంట్లో ఎక్కువ కేటాయించబడుతుంది
  1.  
  2. రోగి ఆసుపత్రి సందర్శన మందుల అవసరాన్నిబట్టి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
  3. నెట్ వర్క్ ఆరోగ్యమిత్రతో కలిసి రామ్కో రోగి వైద్య సేవల కొనసాగింపుకు సహకరిస్తారు .

ఆర్థికపరమైన కవరేజి

ఆర్థికపరమైన విధానం
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో కుటుంబానికి సంవత్సరానికి బీమా మొత్తం 3 లక్షలు కుటుంబానికి బీమా చేసే మొత్తం ఫ్లోటర్ విధానంలో వుంటుంది. లబ్దిపొందే కుటుంబం మొత్తం కవరేజి మొత్తాన్ని లబ్దిపొందే కుటుంబంలోని ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వినియోగించుకోవచ్చు. దీన్నే ఫ్లోటర్ చేసిన నిర్వహిస్తారు. 175 కోట్ల బఫర్ మిగులు మొత్తం ఏర్పాటవుతుంది. ఒకవేళ లబ్దిపొందే కుటుంబానికి అందాల్సిన వైద్య సేవల ఖర్చు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ అయితే అదనంగా నిధులు ఈ మిగులు మొత్తం నుంచి అందచేయబడతాయి. ఈ మిగులు నిధులు కూడా ఫ్లోటర్ విధానంలో వినియోగించబడుతుంది. ఈ అదనపు నిధులు వినియోగానికి వైద్యులచే ఏర్పాటైన సాంకేతిక కమిటి ఆమోదం తెలుపుతుంది.
నిధుల విడుదల - విరాళం
ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ నిధిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనరులు 40 శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నెలవారీ ప్రీమియం విరాళంతో నిర్వహిస్తాయి. వేతన చెల్లింపు అధికారి (డి.డి.ఒ) జీతం నుంచి మినహాయించిన లబ్దిదారు ప్రీమియంను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు చెల్లిస్తారు. ఎన్రోల్ కావడం, విరాళం తప్పనిసరి, భార్యభర్తలు యిరువురు అర్హులైన ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనరులు అయితే వారిద్దరు ఎన్రోల్మెంట్, విరాళం తప్పనిసరి. ఎట్టిపరిస్థితులలో ఆధారపడిన కుటుంబ సభ్యుల ఎన్రోల్మెంట్లో డూప్లికేషను అనుమతించరు.
పరిపాలన ఖర్చు
ఈ పధకంలో పరిపాలన ఖర్చులు సీలింగ్ని 5 శాతం అనుమతించడం జరిగింది.
వార్డ్ సౌకర్యం
మూడు స్లాబులుగా విభజించిన వేతన గ్రేడ్ ఆధారంగా ఉద్యోగులు, పెన్షనరులకు సాధారణ వార్డ్, సెమి ప్రైవేటు వారు ప్రైవేటు వార్డులలో ప్రవేశం వుంటుంది. అఖిల భారత సర్వీసు అధికార్లు, వారికి సమాన స్థాయి అధికార్లు అదిక ప్రీమియం చెల్లించాలి
  1.  
  హెల్త్ కార్డ్   కొరకు :http://www.ehf.gov.in

0/Post a Comment/Comments